Monday, 26 August 2013

ఉన్నట్లా..లేనట్లా??








ఉన్నట్లా..లేనట్లా??


       
ఉన్నట్లా..లేనట్లా??(27-08-2-13)

           గత కొన్ని సంవత్సరాలుగా...ఇంకా చెప్పుకోవాలంటే కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక ఉద్యమాలు ప్రారంభించబడ్డాయి లేదా ఊపందుకున్నాయి. ఇక ప్రస్తుత Hot Topic అంతా తెలంగాణానే. ఇందులో స్పష్టత ఇచ్చీ ఇవ్వనట్లుగా దోబుచులాడుతున్నారు మన హస్తిన పెద్దలు. అంతవరకు బాగానే ఉంది.

        కానీ గత కొన్ని రోజులుగా చూస్తున్న వార్తల్లో మాత్రం మన పెద్దలు కొందరు తెలంగాణాతో పాటు సీమలో సగ భాగం కలపాలనీ లేదా పూర్తిగా నాలుగు జిల్లాలుగా ఉన్న సీమనే కలపలన్న ప్రతిపాదన వచ్చింది. ఇలాంటి వాటికి ప్రజలు ఎక్కడా స్పందిస్తున్నట్లు లేరనుకోండి..అది వేరే విషయం. సరే ఇది కూడా చాలదన్నట్లు మన నాయకులు పనిలో పనిగా ఉత్తరాంధ్ర జిల్లాలయిన శ్రీకాకుళం,విజయనగరం,విశాఖపట్టణంలను కలిపేద్దాం అని ఒకరు, లేదు లేదు మన్యంగా ఏర్పడదామని మరొకరు ఇలా ఎవరికి వారు, " చేసుకున్న వారికి చేసుకున్నంతఅన్న చందాన జిల్లాలకు జిల్లాలను పంచేసుకుంటున్నారు. దీనికి తోడు, ఇక పతాక శీర్షికలకెక్కే పనులకు శ్రీకారం కూడా చుడుతున్నారు. ఇక్కడే నాకో విషయం బోధపడటం లేదు..ఉద్యమం ఉన్నట్లా...లేనట్లా??

         ఇలా లెక్కలేసుకుంటూ పోతే చివరకు ఇటు సీమకు అటు ఉత్తరాంధ్ర కు మధ్యలో అటూ ఇటూ కాకుండా త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుకుంటున్నవి ఉభయ గోదావరి,కృష్ణా,గుంటూరు,ప్రకాశం,నెల్లూరు. త్రిశంకు స్వర్గం కాకుండా మిగతా అన్ని ప్రాంతాలనీ ఒక ప్రత్యేక రాష్త్రంగా ఏర్పాటుచేసినట్లు ప్రకటించినా ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద అతిశయొక్తి కాదేమో!!!

       వీళ్ళ లెక్కలు ఎలా ఉన్నా మన తెలుగు ఓటరు మాత్రం చాలా స్పష్టతతో ఉన్నాడు అన్న విషయం మన నాయకులు గుర్తెరిగితే మంచిది.

       అయినా మనలో మన మాట, ఇక 6 జిల్లాలకు ఒక రాష్ట్రం చేసే బదులు ఇవి కుడా పనిలో పని,వాటితోపాటు కలిపేద్దురూ!!!









No comments:

Post a Comment