ఈ మధ్య ఎక్కడ చూసినా ఒకటే హోరు !! దిగజారుతున్న రూపాయి ,పడిపోతున్న రూపాయి , మరింత పడనున్న రూపాయి అని!! సగటు భారతీయుడికి ఇది నిజం గా మింగుడు పడని విషయం!! ఇక రూపాయి ఇలా వైకుంఠ పాళీ లో పాము నోటిలో చిక్కుకున్నట్లు కథ మళ్ళి మొదటికే వస్తోంది!! మళ్లీ ఆటలో నిచ్చెన ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే వాళ్ళలో మీతో పాటు నేను కూడా ఉన్నాను .
"కర్ణుడి చావుకి కారణాలు అనేకం " అన్నట్లు దీనికి కూడా సవాలక్ష కారణాలు ఉన్నాయి . ఏదయితేనేం ,పరిస్థితి ఇలాగే కొనసాగితే, డాలర్ తో మన మారకం విలువ Rs 70 తాకినా ఆశ్చర్య పోనవసరం లేదని సాక్షాత్తు మన ఆర్ధిక నిపుణులే హెచ్చరిస్తున్నారు . ఎంత కళ్ళెం వేద్దామని ప్రయత్నించినా మన ప్రభుతం, అది వారికి శక్తికి మించిన పనే అవుతోంది .
ఇదిలా ఉంచితే చదువుకున్న వారిగా మనం ఏమి చేస్తున్నాం అంటే ఇదేదో ఆర్ధిక నిపుణుల సమస్యగా , లేక రిజర్వు బ్యాంకో లేదా ఏదో ఒక మంత్రిగారో పని లాగా వారే ఈ సమస్యలకు సమాధానం చెప్పుకుంటారు అని పరిగణించి, వీటికి పరిష్కారాలు కుడా వారే ఏదో ఒకటి చేస్తారులే అన్నట్లుగా మిన్నకుండి పోయే వారినే ఎక్కువగా చూస్తున్నాము . రూపాయి మరి దిగాజరినప్పుడు మనం కూడా కాస్త వేడి నిట్టూర్పులు పతనానికి సమానం గా విడిచి మన దారిన మనం పోతున్నాం !!!
ఒకప్పుడు విదేశీ వస్తువులను బహిష్కరించిన మనమే ఇప్పుడు విదేశీ అని వేళ్ళాడుతున్నాం . ప్రస్తుత globalization విధి విధానాల్లో ఇవి ఒకందుకు మంచిదే కాని మనం కూడా మన వంతు సహాయం గా మన ఇంటి మహాలక్ష్మి అయిన రూపాయి ని రక్షించుకోవచ్చు..కాని పరోక్షం గా. .!!
ఒక సారి మీ ఇంట్లో వాడే మీ నిత్యావసర వస్తువులను గుర్తు తెచ్చుకోండి , toothpaste ,షాంపూ,soap ,shaving cream ఇలాంటివి . నిశితం గా పరిశీలిస్తే మనం వాడే ఇలాంటి వస్తువుల్లో సుమారు 80% మన స్వదేశి వస్తువులు కాదు !! ఉదాహరణకు ఒక lux soap కొనెబదులు ఇంచుమించు అదే ధరకు లభిస్తున్న మైసూరు sandle soap ని వాడలేమా? ఒక samsung వస్తువు కోనేముందర ఏమన్నా ఆలోచిస్తున్నామా? ఇవన్నీ ఒక రకం గా చూసుకుంటే చిన్న చిన్నవే !! కానీ మన ఇంటి మహాలక్ష్మి మీద చూపే లాభాలు అనేకం . ఇలాంటి చిన్న చిన్న చర్యలను పాటిస్తే మనం కూడా ఉడతా భక్తీ ని ప్రదర్శించిన వాళ్ళము అవుతాం ..
నేనేమీ మీ అభీష్టాలను ,ఇష్టా ఇష్టాలను మార్చుకోమని చెప్పటం లేదు..ఒక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోమని అభ్యర్ధిస్తున్నాను !!
భవదీయురాలు
సుభాషిణి
-

No comments:
Post a Comment