ఏ ఊరో తెలియని "కావూరి"
ఏ పాటీ చేయలేని "రాయపాటి"
జగదమెరుగని "లగడపాటి"
వీళ్ళేరా మన నేతలు...సలాము కొట్టే సర్ జీ లు!!
మన మీద కృప లేని "కృపా" రాణికి !!!
పేరుకేమో "ఝాన్సీ "లు , పార్లమెంట్ లో ఫాన్సీ లు
మనకేమో అందరిది ,
తానేమొ జాణది, ఆమేరా "పురందరి "!!
వీళ్ళేరా మన నేతలు...సలాము కొట్టే అక్కయ్యలు!!
ఉండాలో పోవాలో తెలియని "ఉండవల్లి",
అనకాపల్లి ని వెనకన పెట్టీ
పబ్బం గదిపాడు రా మన "సబ్బం హరి '!!!!
నోట్లతో రైలెక్కడు మన కోట్ల!!
ఇక వివక్షతే మన ఫట్ల!!
వీళ్ళేరా మన నేతలు...సలాము కొట్టే సర్ జీ లు!!
చింతలే లేని "చింతా ",
లేడురా ఇక వెంకన్న నీ చెంత !!
కళ్ళు మూసుకుపోయిన "కనుమూరి",
కానీ కాళ్ళూన్నయి "కొండ" పైకి!!
వీళ్ళేరా మన నేతలు...సలాము కొట్టే సర్ జీ లు!!
పనబాకకు ఎనకమాల
ఎముందో ఎవరికెరుక??
మెగాలకు అందే చిరు తాయిలలు
నీకెరుకా...నాకెరుకా?
వీళ్ళేరా మన నేతలు...సలాము కొట్టే సర్ జీ లు!!
ఒకరు "అనంత " కపట ధారీ !
మరొకరు రాజంపెటను అమ్మిన "అన్నయ్యగారీ"
గుండెంటె గుర్తుకొచె "మాగుంట"
తీసాడంట మనకొక నిజమైన గుంట.
వీళ్ళేరా మన నేతలు...సలాము కొట్టే సర్ జీ లు!!
(*ఒకరు రైలు కోసం, ఒకరు జౌళి కోసం ఏదయితేనేం ...
పదవులకు అమ్ముడుపోయిన మన ప్రజా ప్రతినిధులు!)
Chala bagundi ... correct gaa chepparu
ReplyDelete