Saturday, 31 August 2013

భారతీయులు డైటింగ్ చెయ్యాలోచ్!!!

     భారతీయులు డైటింగ్ చెయ్యాలోచ్!!!

 ఇక నుండి ఏడాక్టరు సలహా లేకుండా ప్రతి భారతీయుడు డైటింగ్ చెయ్యాలండీ!!! ఎందుకంటారా..ఈ మాట వినగానే "కడుపు" మండిపోయి ఒక రకమైన బెంగ వచ్చేస్తోంది కదా!!! మరే!! మరి మన రూపాయేమో రోజు రోజుకీ దిగజారిపోయి అధ` పాతాళానికి  తొక్కివేయబడుతోంది. డైటింగ్ అని రూపాయి కథ చెపుతారేంటి అని విసుక్కోకండి!! అక్కడే ఉంది అసలైన కిక్.
   బంగారం దిగుమతి చేసుకోవటం లో భారతీయులకు భారతీయులే  సాటిఅది మనకో సెంటిమెంట్రూపాయి క్షీణత పుణ్యమా అని ఒక పక్క ద్రవ్య లోటు పెరిగిపోతోందిదీన్ని ఆపాలంటే పుత్తడి జోలికి పోవద్దు అని ఇటు ప్రధానిఅటు విత్త మంత్రి మన చెవుల్లో ఇళ్ళు కట్టుకుని చెప్తున్నారు.(కొన్ని రకాల ఎలక్త్రానిక్ వస్తువుల జోలికి  పొవద్దని మాత్రం చెప్పలేదుఎందుకో మరి వారికే తెలియాలి). "ఉరిమి ఉరిమి మంగళం మీద పదినట్లుఇదే కారణం  అని కూడా అంటున్నారుపనిలో పనిగా గుళ్ళు గోపురాల్లో ఉన్న భగవంతుని నగలు కూడా అమ్మేసి ఈ సంక్షోభం నుండి గట్టేక్కేద్దాం అని ఎదురు సలహాలిస్తున్నారు 
అవునా కాదా అన్న విషయం పక్కకి పెడితే, పుత్తడి దిగుమతుల్ని  కట్టడి చేస్తే లోటుని నిలువరించవచ్చు అని ఆలోచన!! కాదని అనలేం!!

    ఇక వ్యవసాయం విషయానికి వస్తేప్రకృతి కన్నెర్ర చేయతం ఒక ఎత్తైతే , ఆహార,ఉద్యోగ భద్రతలు వచ్చేసి సగటు రైతుకి కులీలు దొరకటం లేదు!! దొరికినా మూలిగే నక్కపై తాటిపండు అన్న చందాన కూలి చెల్లించలేకపొతున్నాడుదీనితో కనీసం పొలంలో కలుపు తొలగించుకోలేని రైతు పంట పండించటం మానేసి తన పొలాన్ని  రియల్ ఎస్టేటుగానో మారుస్తున్నాడుఏదీ కాకపోతే ప్రభుత్వమే ఏదొ సెజ్ అని నామకరణం చేసేసి భూములను స్వాధీనం చేసుకుంటోందియువత గ్రామల్లో అవకాశాలు లేకపట్టణాలకు పరుగు పెడుతున్నారుఇది ఇలాగే కొనసాగితే మన కమతాల పరిమాణం మరింత కుదించుకునిపోయిఇక పూర్తిగా ఆహార దిగుమతులపైనే మనం అధారపడే  ప్రమాదం ఉందిఅంటే మళ్ళీ "ద్రవ్య లోటుమొదలైనట్లే కదా!!! మరి  లోటుని పూరించాలంటే మనం అన్నం తినటం తగ్గించుకోవాలి లేదా మానెయ్యాలి కదా...!బంగారం కొనడం తగ్గించుకున్నట్లుగా అన్నమాట!అనగా..మేము అన్నం లేక అన్నం తినటం మనేశాం అని చెప్పుకుంటే మనకి పరువు తక్కువ కాబట్టి దాన్నే "డైటింగ్" అనుకోవాలి మరి!!ఎంచక్కా ఇక డాక్టరు సలహా లేకుండానే మనం "డైటింగ్చేసుకోవచ్చన్న మాట!!
ఇదండీ సంగతి.!!!


@@@@







1 comment:

  1. Government wants to reduce the imports which are non-productive. Gold is non-productive. Whereas, electronic equipment, petrol etc. are productive. We should never put restrictions on anything that is productive. That's why, government says only reduce import of gold.

    On a different note, if you can put archive posts in the site, it would be easy to browse through all the posts. Otherwise, it is difficult to read all the posts. When I opened this site first time, I thought, you had written only two posts. Only when i added it to my feed reader, I realized that, there are more posts.

    ReplyDelete