Monday, 26 August 2013

ఒక బస్సు ఆత్మ కథ

ఒక బస్సు ఆత్మ కథ
            నా పేరు బస్సు, నేను చిన్న గ్రామాల నుండి పెద్ద పెద్ద నగరాలను సైతం కలుపుతూ ప్రజల మధ్య రవాణా సంబధాలను నెలకొల్పుతూ వుంటాను. పొద్దున లేచిన దగ్గర నుండి వార్తా పత్రికలను ఇతరత్రాలను చేరవెస్తూ వివిధ రకాల పౌరులను  విద్యార్ధులను వారి వారి గమ్య స్థానాలకు  చేరుస్తూ  వుంటాను. నేను పుట్టి కొన్ని సంవత్సరాలు అయినా నాకంటూ ఒక ప్రత్యెక గుర్తింపు వచ్చింది ఆంధ్ర ప్రదేశ్ లోనే.అందుకే నాకు ఆంధ్ర అంటే అమిత ప్రీతి. ఆదిలాబాద్ నుండి అనంతపురం వరకూ, శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు ఒకటేంటి...అన్ని ప్రాంతాలు నావే!!! నాకు తెలంగాణా బస్సు అని, రాయలసీమ బస్సు అని లేక ఆంధ్ర బస్సు అని ఇలా అనేక పేర్లు లేవండోయ్.!!!. ఎక్కడికి వెళ్ళిన నన్ను అందరు బస్సు అనే పిలుస్తారు. రాజధాని లోను, నగరాల్లోనూ  తిరిగే సిటీ బస్సు లకు ఒక రంగు అయితే పల్లెల్లో వెళ్ళే 'పల్లె వెలుగు' కి మరో హంగు. దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులకు న దగ్గర లభించే సౌలభ్యాలు కూడా ఎక్కువే. పగలు, రాత్రి తేడా తెలియకుండా చేలను పొలాలను ఘాట్ రోడ్లను ఒకటేమిటి అనేకం దాటుకుంటూ  వారి వారి గమ్య స్థానాలకు చేరుస్తూ ఉండటమే నా వృత్తి ఇంకా నా ప్రవృత్తి కుడా. అనేక సార్లు అస్తవ్యస్తమయిన రోడ్ల పై నా ప్రయాణం సాగుతూ వుంటుంది. ప్రకృతి కన్నెర్ర చేసి వానలు వరదలు వచ్చిన నా ఒళ్ళు హుఉనం అయిపొథూ వుంటుంది. అయితేనేం....నన్ను నమ్మిన నా ప్రయనీకులని గమ్య స్థానాలకు చేర్చతమే నా లక్ష్యం!!!!
కాని...ఈ మధ్య ఎవరో ఢిల్లీ నుండి ఏదో ప్రకటన చేసారంట...నాకయితే తెలియదు కాని...ఇక్కడి ప్రజలు అభం శుభం తెలియని నా మీద ఆగ్రహించారు. అమాయకంగా రొడ్డు పై జింకలా పరిగెడుతున్న నన్ను పట్టుకుని తగులపెట్టారు . ....పెడుతున్నారు. నన్ను నా పని చేసుకోనివ్వకుండా...నా గమ్యాన్ని చేరనీయకుండా రాస్తారోకోలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న హైవే పై నా రెండు కళ్ళు (అద్దాలు) లను నిర్దాక్షిణ్యం గా రాళ్ళతో కొట్టారు. ఎవరికన్నా మొర పెట్టుకుందాము  అంటే నా గోడు వినే నాధుడే లేడు!!!!!!!! భారానికి మించి ప్రయాణీకులు కిక్కిరిసి నాలో ఎక్కినా నేనేమీ బాధ పడలేదు. మౌనం గా భరించాను. ఎందుకంటే...వారిని గమ్య స్థానాలకు చేరుస్తున్నానన్న  సంతృప్తి నన్ను నోరు మెదపనివ్వలేదు. అందరికి ఉపకారం చేసే  నా మీద మీ అందరికీ ఎందుకంత కసి???  మీకు కోపం వస్తే చర్చించు కొండి. ..... పరిష్కార మార్గాలు అలోన్చించు కొండి. ఎప్పుదూ చెంగున పరిగెత్తే నేను ఈ మధ్య కుదేలునయిపోయాను. బయటకు రావాలంటేనే  భయం గా వుంది.!!!!
చదువుకున్న మీరు అయిన chepparuuu.... ఉద్యమం అంటే గొడవలు రాస్తారోకోలు కాదని...శాంతియుతం గా అలోచించి సమస్యలను పరిష్కరించుకొనే ఆయుధం అని. ,
ఇది అందరి మంచి గురించి ఆలోచించే  ఒక బస్సు గా మీతో పంచుకున్న నా ఆలోచన.  .
                                                                                             ఎప్పటికీ మిమ్మలిని అభిమంచే ...మీ బస్సు.


1 comment: